నటుడు ప్రకాశ్ రాజ్‌కు ప్రమాదం..

82
prakash raj
- Advertisement -

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రంలో ప్రకాశ్ రాజ్ కూడా నటిస్తున్నారు. చెన్నైలో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన షూటింగ్‌ జరుగుతున్న సమయంలో కిందపడడంతో ఎముక స్వల్పంగా విరిగిందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

అయితే శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారట, తన మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి సురక్షితమైన హస్తాలతో సర్జరీ చేయించుకోబోతున్నానని ప్రకాశ్ రాజ్ వివరించారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. సెప్టెంబరులో మా ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -