రేవంత్ రెడ్డిపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి..

31

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఈరోజు టీఆర్‌ఎస్‌ఎల్సీ ఆఫీసులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కనిపిస్తే ఉమ్మి వేయ్యాలని దళితులు చూస్తున్నారని విమర్శించారు.

దళితబంధును రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రేవంత్ మాటలు విని సభపై ఉన్న శ్రీధర్ బాబు- భట్టి అశ్చర్యం వ్యక్తం చేశారని చిరుమర్ది లింగయ్య పేర్కొన్నారు. సంచులు మోసి- పదవులు పొందిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. నిన్నటి వరకు సీఎంను పొగిడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవ్వాళ విమర్శలు చేస్తే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ ఎంచుకున్న వేదిక సరైంది కాదన్నారు. రేవంత్ రెడ్డి సంస్కారంతో మాట్లాడాలి- లేదంటే మట్టి కరిపిస్తారని చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.