సుధీర్‌-అనసూయలను అందుకే తీసుకున్నాం- ప్రకాష్‌ రాజ్‌

199
- Advertisement -

టాలీవుడ్‌లో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు’ సంచలనంగా మారాయి. ఇందులో నటులు మంచు విష్ణు,ప్రకాష్ రాజ్ ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక ప్రకాష్ రాజ్ ఇదివరకే తన ప్యానల్ అంటూ కొంత మందిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. కానీ శుక్రవారం మాత్రం సిని‘మా’బిడ్డలు అనే పేరుతో తన ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించేశారు. ఎవరెవరిని మెంబర్లుగా తీసుకున్నారో.. ఎవరిని మెయిన్ ప్యానల్‌లోకి తీసుకున్నారో ప్రకటించారు. అందరి నిర్ణయంతోనే సభ్యులను ఎంచుకున్నామని, తాను అధ్యక్షుడిగా పోటీ చేయబోతోన్నానని ప్రకాష్ రాజ్ మీడియా ముందు ప్రకటించారు. ఎన్నికల తేది దగ్గర పడుతుండటంతో ప్రచారం ముమ్మరం చేశాడు ప్రకాష్‌ రాజ్‌.

తన ప్యానల్‌లో ప్రకాశ్‌రాజ్‌ (అధ్యక్షుడు), నాగినీడు (ట్రెజరర్‌), బెనర్జీ, హేమ (ఉపాధ్యక్షులు), శ్రీకాంత్‌ (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), జీవితా రాజశేఖర్‌ (జనరల్‌ సెక్రటరీ), అనితా చౌదరి, ఉత్తేజ్‌ (జాయింట్‌ సెక్రటరీ). ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా అనసూయ, అజయ్, బి.భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూమ్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, డి.సుబ్బరాజు, సురేశ్‌ కొండేటి, తనీశ్, టార్జాన్‌ ఉన్నారు. అయితే వీరిని మాత్రమే ఎందుకు తీసుకున్నారో కూడా వివరించారు. కొత్త వారికి, కుర్రాళ్లకి, మహిళలకు, బుల్లితెరకు అందరికీ ఇలా సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇలా ప్యానెల్‌ను డిజైన్ చేశామని ప్రకాశ్‌ రాజ్ తెలిపారు.

ఈ క్రమంలో బుల్లితెర యాంకర్‌ అనసూయ, నటుడు సుధీర్‌లను ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ మెంబర్స్‌గా ఎందుకు తీసుకున్నారో కూడా వివరించారు. ‘అనసూయ గొప్ప యాంకర్‌ .అందరితో కలిసి మాట్లాడగలికే శక్తి ఉన్న లేడి. బుల్లితెర నటీనటుల కష్టాలు ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమెను సెలెక్ట్‌ చేశాం’అన్నారు. ఇక సుధీర్‌ గురించి మాట్లాడుతూ..‘యూత్‌ ఐకాన్‌ సుధీర్‌. అలాంటి కుర్రాళ్లతో కలిసి పని చేస్తే మాక్కుడా కొత్త ఆలోచనలు వస్తాయి. వచ్చే తరాలకు వీళ్ల ఐడియాలు పనికొస్తాయి. ఆ కారణంగానే సుధీర్‌ని సెలెక్ట్‌ చేశాం’అని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు.

- Advertisement -