ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ రోజు తెల్లవారుఝామున చిరు ఇంటికి వెళ్లి ఆయన్ని జిమ్‌లో కలిసారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి చిరంజీవి చూపుతోన్న చొరవ పట్ల ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
‘ఉదయాన్నే బాస్ తో జిమ్ లో సమావేశమయ్యాను. సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యలకు పరిష్కారం కోసం ఆయన చూపుతోన్న చొరవకు కృతజ్ఞతలు చెప్పాను. అన్నయ్య మాకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఓ వరంలా సినీ పరిశ్రమలో మాకు ఇటువంటి వ్యక్తి ఉన్నారు’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఆయనకు చిరు మద్దతు ఉన్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం చిరు-ప్రకాష్ భేటీతో ‘మా’రింత ఆసక్తికరంగా మారింది.