టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్.. తొలి పోరులో భారత్‌-పాక్‌..

170

యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి పురుషుల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది. ఐసీసీ ఈ మేరకు తాజాగా పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇక రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమ‌న్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 17న ఈ మ్యాచ్ జ‌రుగుతుంది. అదే రోజు స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్ మ‌రో మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఇక అక్టోబ‌ర్ 23న అస‌లు టోర్నీ అంటే సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా త‌ల‌ప‌డ‌తాయి. అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్‌, వెస్టిండీస్ ఆడ‌నున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

టీమిండియా త‌న త‌ర్వాతి మ్యాచ్‌ల‌ను అక్టోబ‌ర్ 31న న్యూజిలాండ్‌తో, న‌వంబ‌ర్ 3న ఆఫ్ఘ‌నిస్థాన్‌తో, నవంబ‌ర్ 5న గ్రూప్ బిలో టాప్ పొజిష‌న్‌లో నిలిచిన టీమ్‌, న‌వంబ‌ర్ 8న గ్రూప్ ఎలో రెండో స్థానంలో నిలిచిన టీమ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల‌న్నీ భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7.30 గంట‌ల‌కే ప్రారంభ‌మ‌వుతాయి.

ఇక సెమీ ఫైనల్ అబుదాబి వేదికగా నవంబర్ 10న సాయంత్రం 6.00 గంటలకు, రెండో సెమీఫైనల్ దుబాయ్‌లో నవంబర్ 11న సాయంత్రం 6.00 గంటలకు జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌లకు కూడా ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో నవంబర్ 14న జరుగనున్నది.

రౌండ్ 1 షెడ్యూల్:

అక్టోబర్ 17 – ఓమన్ Vs పపువా న్యూగినియా – ఒమన్
అక్టోబర్ 17 – బంగ్లాదేశ్ Vs స్కాట్లాండ్ – ఒమన్
అక్టోబర్ 18 – ఐర్లాండ్ Vs నెదర్లాండ్ – అబుదాబి
అక్టోబర్ 18 – శ్రీలంక Vs నమీబియా – అబుదాబి
అక్టోబర్ 19 – స్కాట్లాండ్ Vs పపువా న్యూ గినియా – ఒమన్
అక్టోబర్ 19 – ఒమన్ Vs బంగ్లాదేశ్ – ఒమన్
అక్టోబర్ 20 – నమీబియా Vs నెదర్లాండ్స్ – అబుదాబి
అక్టోబర్ 20 – శ్రీలంక Vs ఐర్లాండ్ – అబుదాబి
అక్టోబర్ 21 – బంగ్లాదేశ్ Vs పపువా న్యూగినియా – ఒమన్
అక్టోబర్ 21 – ఒమన్ Vs స్కాట్లాండ్ – ఒమన్
అక్టోబర్ 22 – నమీబియా Vs ఐర్లాండ్ – షార్జా
అక్టోబర్ 22 – శ్రీలంక Vs నెదర్లాండ్స్ – షార్జా

సూపర్ 12 గ్రూప్ 1 మ్యాచ్‌లు..

అక్టోబర్ 23 – ఆస్ట్రేలియా Vs సౌతాఫ్రికా – అబుదాబి
అక్టోబర్ 23 – ఇంగ్లాండ్ Vs వెస్టిండీస్ – దుబాయ్
అక్టోబర్ 24 – ఏ1 Vs బీ2 – షార్జా
అక్టోబర్ 26 – సౌతాఫ్రికా Vs వెస్టిండీస్ – దుబాయ్
అక్టోబర్ 27 – ఇంగ్లాండ్ Vs బీ2 – అబుదాబి
అక్టోబర్ 28 – ఆస్ట్రేలియా Vs ఏ1 – దుబాయ్
అక్టోబర్ 29 – వెస్టిండీస్ Vs బీ2 – షార్జా
అక్టోబర్ 30 – సౌతాఫ్రికా Vs ఏ1 – షార్జా
అక్టోబర్ 30 – ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా – దుబాయ్
నవంబర్ 1 – ఇంగ్లాండ్ Vs ఏ1 – షార్జా
నవంబర్ 2 – సౌతాఫ్రికా Vs బీ2 – అబుదాబి
నవంబర్ 4 – ఆస్ట్రేలియా Vs బీ2 – దుబాయ్
నవంబర్ 4 – వెస్టిండీస్ Vs ఏ1 – అబుదాబి
నవంబర్ 6 – ఆస్ట్రేలియా Vs వెస్టిండీస్ – అబుదాబి
నవంబర్ 6 – ఇంగ్లాండ్ Vs సౌతాఫ్రికా – షార్జా

సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్‌లు..

అక్టోబర్ 24 – ఇండియా Vs పాకిస్తాన్ – దుబాయ్
అక్టోబర్ 25 – అఫ్గానిస్తాన్ Vs బీ1 – షార్జా
అక్టోబర్ 26 – పాకిస్తాన్ Vs న్యూజీలాండ్ – షార్జా
అక్టోబర్ 27 – బీ1 Vs ఏ2 – అబుదాబి
అక్టోబర్ 29 – అఫ్గానిస్తాన్ Vs పాకిస్తాన్ – దుబాయ్
అక్టోబర్ 31 – అఫ్గానిస్తాన్ Vs ఏ2 – అబుదాబి
నవంబర్ 2 – పాకిస్తాన్ Vs ఏ2 – అబుదాబి
నవంబర్ 3 – న్యూజీలాండ్ Vs బీ1 – దుబాయ్
నవంబర్ 2 – ఇండియా Vs అఫ్గానిస్తాన్ – అబుదాబి
నవంబర్ 5 – న్యూజీలాండ్ Vs ఏ2 – షార్జా
నవంబర్ 5 – ఇండియా Vs బీ2 – దుబాయ్
నవంబర్ 7 – న్యూజీలాండ్ Vs అఫ్గానిస్తాన్ – అబుదాబి
నవంబర్ 7 – పాకిస్తాన్ Vs బీ1 – షార్జా
నవంబర్ 8 – ఇండియా Vs ఏ2 – దుబాయ్
నవంబర్ 10 – తొలి సెమీ ఫైనల్
నవంబర్ 11 – రెండో సెమీఫైనల్
నవంబర్ 14 – ఫైనల్