మా ఎన్నికలు.. సినీ కళాకారులకు ప్రకాష్‌​ రాజ్​ పిలుపు..

101
Prakash Raj
- Advertisement -

అక్టోబర్ 10న జరుగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ “మా” ఎన్నికల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈసారి మా ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలోని కార్మికుల సమస్యల గురించి చర్చించేందుకు ప్రకాష్‌ రాజ్ పిలుపునిచ్చారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన ఆయన.. ప్రచారంలోకి దిగేశారు. ఇప్పటికే అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఇచ్చారన్న వార్తలూ వెలువడ్డాయి.

అయితే తాజాగా సినీ కళాకారుల సమస్యల గురించి తెలుసుకునేందుకు వారితో ప్రకాష్‌ రాజ్ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్‌లో వారందరికీ ఆయన విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ‘‘అందరం మాట్లాడుకుందాం. మా లక్ష్యాలపై చర్చిద్దాం. అందరం కలిసి విందు చేద్దాం’’ అంటూ ఓ ఆహ్వాన సందేశాన్ని సినీ కళాకారులకు ప్రకాష్ రాజ్ టీమ్ పంపినట్టు తెలుస్తోంది.కాగా ఈ ఎన్నికల్లో నటులు మంచు విష్ణు,ప్రకాష్‌ రాజ్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

- Advertisement -