OG:సత్యదాదాగా ప్రకాశ్‌ రాజ్

6
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ అత్యంత ఆసక్తికరమైన గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మేకర్స్ వరుసగా క్యారెక్టర్ పోస్టర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నిన్న అర్జున్ పాత్రలో అర్జున్ దాస్ లుక్‌ను విడుదల చేయగా, ఈ రోజు సత్యా దాదా పాత్రలో ప్రకాశ్ రాజ్ లుక్‌ను ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని క్యారెక్టర్ పోస్టర్స్ వెలువడనున్నాయి.

ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, శ్రీయా రెడ్డి, శామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చగా, DVV ఎంటర్‌టైన్‌మెంట్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది.

Also Read:ఊరు ఊరికో.. గుడి గుడికో జమ్మి చెట్టు

- Advertisement -