ఊరు ఊరికో.. గుడి గుడికో జమ్మి చెట్టు

14
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దసరా పండుగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో కోటి లోని యోగానంద లక్ష్మి నర్సింహ స్వామి వారి ఆలయ పరిధిలో హోమం అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో రాఘవేందర్ యాదవ్ , కరుణాకర్ రెడ్డి జమ్మి మొక్కను నాటడం జరిగింది.

వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్లును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించింది. అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని జోగినపల్లి సంతోష్ కుమార్ సంతోష్ కుమార్ గారు తీసుకున్నందుకు అందరి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:అమెరికాలో మళ్లీ కాల్పులు

- Advertisement -