- Advertisement -
తనపై మెగాబ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు నటుడు ప్రకాశ్ రాజ్.‘ప్రతి పనికిమాలిన వాడూ విమర్శిస్తున్నాడు’ అంటూ ఘాటుగా ప్రకాశ్ రాజ్‌పై మండిపడ్డారు. దీనిపై తనదైనశైలీలో స్పందించారు ప్రకాశ్ రాజ్.
గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి.నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు అంటూ చురకలంటించారు.
ప్రకాష్ రాజ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషణకు దిగారు నాగబాబు. దర్శకుల్ని కాకా పట్టి నిర్మాతల్ని ఏడిపించాడని, డబ్బుల కోసం నిర్మాతల్ని హింస పెట్టాడని, ఏదో టీవీ చర్చలో సుబ్రహ్మణ్యస్వామి ప్రకాష్ రాజ్‌ను తొక్కి పట్టి నార తీశాడని సందర్బోచితంగా కామెంట్స్ చేశాడు నాగబాబు. దీనికి తనదైన శైలీలో రిప్లై ఇచ్చారు ప్రకాశ్ రాజ్.
- Advertisement -