కంచె సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్.. అందంగా.. అమాయకంగా.. కనిపిస్తుందని తక్కువ అంచనా వేయకండి. కేడీల తాట తీసే లేడీ పోలీసాఫీసర్ ఈమె.
కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా సాయిధరమ్ తేజ్ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. తేజూకి జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ని ఎంపిక చేశారు. డేరింగ్ అండ్ డైనమిక్ పోలీసాఫీసర్‌గా ప్రగ్యా కనిపించనున్నారు. అతిథి పాత్రకు జోడీ అంటే తళుక్కున మెరిసే చిన్నాచితకా పాత్ర కాదట.
ఇటీవల ఓం నమో వెంకటేశాయ చిత్రంలోని కీలక పాత్రలో కనిపించి అందరిని అలరించింది ఈ హాట్ భామ. నక్షత్రం మూవీ కాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుండగా ఇటీవల సాయిధరమ్ తేజ్ పవర్ ఫుల్ లుక్స్ ని విడుదల చేసింది టీం.
ఇక తాజాగా ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్స్ లుక్స్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్స్ లో ప్రగ్యా అందరి మతులు పోగొట్టేలా ఉంది.