31న సిట్ ముందుకు ప్రజ్వల్!

12
- Advertisement -

ఈ నెల 31న సిట్ ముందు హాజరుకానున్నారు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ. ఏప్రిల్ 26న జరిగిన కర్ణాటక లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ముందు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్‌ పై తీవ్ర విమర్శలు రాగా తాజాగా సిట్ ముందుకు హాజరవుతానని చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపారు. నన్ను తప్పుపట్టొద్దు. నాపై తప్పుడు కేసులు పెట్టారు. మే 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్‌ ఎదుట హాజరవుతాను అని వెల్లడించారు.

విచారణకు పూర్తిగా సహకరిస్తానని…. న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉందన్నారు. నివేదికల ప్రకారం.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టినట్లు ప్రజ్వల్‌ తెలిపారు. విదేశాలకు వెళ్లిన రెండు రోజుల తర్వాత నాపై వచ్చిన ఆరోపణలను యూట్యూబ్‌లో చూశాను. అప్పుడు ఏడు రోజుల సమయం కావాలంటూ సిట్‌కు లేఖ రాశాను అని చెప్పారు.

Also Read:Curd:పెరుగుతో అందం

- Advertisement -