యువ చంద్ర కృష్ణ…’పొట్టేల్’

13
- Advertisement -

సినిమాలకు బిగినింగ్ లో బజ్ తీసుకురావడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. విడుదలకు ముందు మ్యూజికల్ హిట్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంగీతం ప్రాముఖ్యత గురించి బాగా తెలిసిన పోట్టేల్ నిర్మాతలు సౌండ్‌ట్రాక్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. మహా శివరాత్రి సందర్భంగా, సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించిన పొట్టేల్ మేకర్స్ థర్డ్ సింగిల్ శంకర పాటని విడుదల చేశారు

ఈ డివైన్ నెంబర్ ని శేఖర్ చంద్ర స్వరపరచగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. శాండిల్య పిసాపాటి పాడారు. బోనాల కోసం బలి ఇవ్వబోతున్న పొట్టేల్‌ను పోగొట్టు కథానాయకుడు యువ చంద్రకృష్ణ . పొట్టేల్ వెదికిపట్టుకోవడానికి అన్ని మార్గాలు అన్వేషిస్తాడు . ఈ ప్రక్రియలో, అతను వారి ఆచారాలలో భాగమైన త్రిశూల్‌తో తన నాలుకను కుట్టడానికి కూడా ధైర్యం చేస్తాడు.

కథానాయకుడి బాధని పాటలో ఎఫెక్టివ్‌గా చూపించారు. కంపోజింగ్ అత్యద్భుతంగా ఉంది, సాహిత్యం, గానం ఆకట్టుకుంది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కథానాయిక. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.

Also Read:IND vs ENG : భారీ ఆధిక్యంలో భారత్ !

- Advertisement -