ఫైడ్ ప్రపంచ కప్ 2023లో సిల్వర్ టైటిల్ గెలిచారు ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రజ్క్షానంద. ఫైనల్లో ప్రజ్ఞానందపై నార్వేకు చెందిన 32 ఏళ్ల మాగ్నస్ కార్ల్‌సన్ గెలిచాడు. దీంతో ప్రజ్ఞానందకి సిల్వర్ పతకం దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఫైడ్ ప్రపంచకప్ ఫైనల్ వరకు వెళ్లడం, తాను చెస్‌లో రాణించడం వెనుక తన తల్లి నాగలక్ష్మి చేసిన త్యాగం ఉందన్నాడు.
తల్లి మద్దతు వల్లే సిల్వర్ పతకం సాధించానని …ఫైనల్లో తాను మరింత బాగా ఆడితే బాగుండేందని చెప్పాడు. తొలి రౌండ్ గేమ్‌లో క్లార్‌సన్‌ను ఎదుర్కొంటున్న సమయంలోనే సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయానని అన్నాడు. తొలి రౌండ్ గేమ్ చాలా ముఖ్యమైందని, మంచి స్థానంలోనే ఉన్నప్పటికీ ఆ కీలక సమయంలోనే విఫలమయ్యానని చెప్పాడు. ఫైనల్లో తొలి రెండు గేమ్‌లూ డ్రా కాగా తప్పక గెలవాల్సిన ట్రై బ్రేక్‌లో రమేశ్ బాబు ప్రజ్ఞానంద ఓడిపోయాడు.
Also Read:బెండకాయ సర్వ రోగనివారిణి..!