ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా పొద్దుటూరు గ్రామం లో ప్రగతి సుధామ చైర్మన్ DR GBK రావు ఆధ్వర్యంలో ప్రగతి సుధామ లో మొక్కలు నాటారు డైరెక్టర్ రామకృష్ణ, ప్రగతి సుధామ Pro-Advisor Dr S రవీందర్, చీఫ్ హార్టికల్చరిస్ట్ Dr రామారావు మరియు ప్రగతి సుధామ బృందం…
ఈ సందర్భంగా GBK రావ్,రామారావు,రవీందర్ మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే మొక్కలు నాటడం తప్పనిసరి అని అన్నారు.ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యత గా మొక్కలు నాటాలని కోరారు.ప్రగతి సుధామ లో పచ్చదనం, పర్యావరణాన్ని కాపాడడమే ద్యేయంగా వేలాది ఎకరాల్లో ఎన్నో మొక్కలు, వృక్షాలు పెంచుతున్నాము అని మరీ ముక్యంగా ఔషాద మొక్కలు ఎక్కువగా పెంచుతున్నాము అన్నారు. మానవ మనుగడకు మొక్కల నుండి వచ్చే పండ్లు, ఫాలాలే కాకుండా వాటి నుండి మానవ మనుగడకు ఔషాద మొక్కలు ఎంతో ఉపయోగ పడుతాయి అన్నారు.మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకున్నాము అన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి KCR గారి హరిత హారం మరియు ఆయన స్ఫూర్తితో తీసుకొని సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ప్రగతి సుధామ ప్రతిష్టాత్మాకంగా తీసుకొని కొన్ని వేలాది మొక్కలు నాటుతున్నాము అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అందరిని భాగస్వామ్యం చేస్తూ నాలుగు ఏండ్లుగా మొక్కలు నాటడమే ధ్యేయంగా పెట్టుకొని 17కోట్ల కు పైగా మొక్కలు నాటడం అంటే చిన్న విషయం కాదు అని కేవలం సంతోష్ కుమార్ గారికి పచ్చదనం, పర్యావరణం మీద ఉన్న ప్రేమ కనపడుతుంది అన్నారు.ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్ గారు వృక్ష వేదం బుక్ ని అందచేశారు.ఈ కార్యక్రమం లో పూర్ణ చందర్, కార్తీక్, సన్నీ, హరిణి, మృదురవళి మరియు ప్రగతి సుధామ బృందం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..