రాష్ట్రంలోని నలుమూలల నుంచి వాహనాలన్నీ కొంగరకలాన్ వైపే కదులుతున్నాయి. రేపు జరగబోయే ప్రగతి నివేదన సభను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలోనే ఈ సభ చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే అబ్బురపరిచే ఏర్పాట్లతో సభా ప్రాంగణాన్ని అలంకరించారు.
1600 ఎకరాలలో నిర్వహించే ఈ బహిరంగ సభకు, 25 లక్షల మంది హాజరు కానున్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు చేరుకునేందుకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా… టీఆర్‌ఎస్ రూట్ మ్యాప్‌ని రిలీజ్ చేసింది. ఈ రూట్ మ్యాప్ ని క్లియర్ గా అర్థమయ్యేలా బ్లూ ప్రింట్స్ పంపిణీ చేశారు. అందరికీ వాట్సాప్ లలో లొకేషన్ షేర్ చేశారు. జనాన్ని తరలించే ప్రతివాహనానికి ఇంచార్జులను నియమించారు. వీరు జనంతో కలిసి అదే వాహనంలో సభా స్థలానికి చేరుకుంటారు. ఇప్పటికే కొంగరకలాన్ లో ని సభాస్థలికి భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఈ సాయంత్రానికల్లా సభా ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోనుంది. (రూట్ మ్యాప్ లు కింద చూడొచ్చు)