భారత ప్రధాని మోదీ ఏప్రిల్ 24న కేరళలలో పర్యటించనున్నారు. అయితే తాజాగా ఈ పర్యటనకు ముందుకు ప్రధాని మోదీని చంపుతామని బెదిరింపులు రావడంతో కేరళ వ్యాప్తంగా రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. పర్యటన సందర్భంలో ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చిందని కేరళ బీజేపీ అధ్యక్షుడు గత వారం క్రితం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు విభాగంకు పిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇదే విషయంపై వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: లే ఆఫ్..సుందర్ పిచాయ్ జీతమెంతంటే!
ప్రధాని మోదీ భద్రత పరమైన ఆంశాలు ప్రెస్‌కు లీక్ కావడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో కేరళ సురేంద్రన్ స్పందిస్తూ…యథాతథంగా ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుందన్నారు. కోచిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరువనంతపురం చేరుకుంటారు. అక్కడి నుంచే రాష్ట్ర తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్టు తెలిపారు.
Also Read: SanthoshKumar:పర్యావరణ పరిరక్షణే నా ధ్యేయం