- Advertisement -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన స్టార్ యాంకర్ ప్రదీప్ వ్యవహారం ఎట్టకేలకు క్లియర్ కానుంది. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు పట్టుబడుతున్నా ప్రదీప్ రాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ ఓ వీడియో ద్వారా స్పందనను తెలియజేశాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని ప్రదీప్ తెలిపాడు.
‘ డిసెంబర్ 31 నాటి ఘటన విచారకరం. నేను డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమే. తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నా. నేను చేసిన తప్పు మరెవరూ చేయకూడదు. నాపై అనేక అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి. ఎవరూ నమ్మవద్దు. ముందస్తుగా అంగీకరించిన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నా. పోలీసుల సూచనల మేరకు కౌన్సిలింగ్‌కు హాజరవుతానని వీడియోలో పేర్కొన్నాడు ప్రదీప్.
https://youtu.be/rPZbYH4Bs9A
- Advertisement -