చలిగా ఉందన్న లాలూ..తబలా వాయించుకోమన్న జడ్జి

236
- Advertisement -

పశు దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టుతో దోషిగా నిరూపింపబడి, ప్రస్తుతం జైల్లో ఉండి తనకు పడే శిక్ష కోసం వేచి చూస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కోర్టుకు వచ్చిన సందర్భంగా ఆయనకు, న్యాయమూర్తి శివ్ పాల్ సింగ్ కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.. కారాగారంలో బాగా చలివేస్తోందని తనదైన చమత్కార శైలిలో గురువారం న్యాయమూర్తికి తెలిపారు. అయితే తబలా వాయించుకోండని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శివపాల్‌సింగ్‌ బదులిచ్చారు. లాలూకు ఎంత శిక్ష విధించేదీ ప్రకటించనుండడంతో న్యాయస్థానం కిక్కిరిసిపోయింది.

అయితే శిక్ష ఖరారు చేయడాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. లాలూ రికార్డు మొత్తాన్ని తాను పరిశీలించాననీ, నిఘా పక్కాగా ఉన్నట్లయితే దాణా కుంభకోణం చోటు చేసుకునే ఉండేది కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సకాలంలో తగినరీతిలో ఆయన స్పందించలేదని శివపాల్‌సింగ్‌ చెప్పగానే లాలూ జోక్యం చేసుకుంటూ తాను కూడా న్యాయవాదినేనని చెప్పారు. ఆర్జేడీ నేతలు రఘువంశ్‌ప్రసాద్‌ సింగ్‌, శివానంద్‌ తివారీ, లాలూ తనయుడు తేజస్వీ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీలపై ఉన్న న్యాయస్థాన ధిక్కార నోటీసుల గురించీ న్యాయమూర్తి ప్రస్తావించారు. ఈ నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని లాలూ కోరారు.

CBI Court to Announce Quantum of Punishment Today

న్యాయస్థాన గది నుంచి తనను బయటకు తరలించబోతున్న తరుణంలో న్యాయమూర్తిని ఉద్దేశించి లాలూ మాట్లాడుతూ- ప్రశాంతంగా ఆలోచించండని కోరారు. శుక్రవారం నాటి విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యే బదులు ప్రత్యక్ష ప్రసార సదస్సు విధానాన్ని ఎంచుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు. లాలూ శ్రేయోభిలాషుల నుంచితనకూ ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. వాటి వివరాలను వెల్లడించలేదు. వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం కల్పించాలని ఆర్జేడీ అధినేత కోరుతూ, మద్దతుదారులెవరూ కోర్టులో నినాదాలు చేయబోరని చెప్పారు. దానిపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి చెప్పారు. లాలూ శిక్ష విషయాన్ని ఇంకోరోజు వాయిదావేసినా ఇతర నిందితులకు విధించబోయే శిక్షపై వాదనలు గురువారం ముగిశాయి. ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు చేసుకున్న అభ్యర్థనపై వారిని బిర్సాముండా కారాగారంలోనే మెరుగైన వసతులున్న విభాగంలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. లాలూ అదే జైల్లో ఉన్నారు.

- Advertisement -