‘ఆదిపురుష్’ ఆరంభ్.. ప్రభాస్‌ పోస్ట్‌ వైరల్‌..

125
Adipurush
- Advertisement -

రెబల్‌ స్టార్‌ ప్ర‌భాస్ బాలీవుడ్‌లో రామాయ‌ణం కథ ఆధారంగా ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కుతున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకోగా, భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈరోజు నుండి ముంబైలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ విష‌యాన్ని ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేశాడు. ఆదిపురుష్ ఆరంభ్ అంటూ ప్ర‌భాస్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ పెట్టిన ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నాడు. సైఫ్ అలీఖాన్ లంకేశ్‌గా న‌టిస్తున్నాడు. ఇక సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోందని, త‌ల్లి పాత్ర‌లో హేమ‌మాలిని న‌టిస్తోంద‌ని, ల‌క్ష్మ‌ణుడిగా టైగ‌ర్ ష్రాఫ్‌ని ఎంపిక చేసార‌ని బాలీవుడ్‌ వర్గాల నుండి సమాచారం. ఇందులో ఎంత క్లారిటీ ఉంద‌నేది తెలియాల్సి ఉంది. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 11, 2022న విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -