- Advertisement -
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇవాళ ప్రి రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రానుండగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రభాస్.
సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ప్రభాస్ వైట్ షర్ట్ వేసి పంచెకట్టు కట్టుకొని సాంప్రదాయంగా కనిపించారు. ప్రభాస్ తిరుమలలో ఆలయం వద్ద నడిచి వెళ్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read:నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్..
ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read:ఉస్తాద్ కోసం భారీ సెట్టింగ్..
- Advertisement -