Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, March 17, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ఇంస్టాగ్రామ్‌లో “సాహో” న్యూ లుక్.. రిలీజ్ చేయనున్న ప్రభాస్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

ఇంస్టాగ్రామ్‌లో “సాహో” న్యూ లుక్.. రిలీజ్ చేయనున్న ప్రభాస్

May 20, 2019 3:55 PM
379
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    ‘బాహుబలి’ 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. రేపటి నుంచి ప్రభాస్ సాహో ప్రమోషన్స్ ని మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా సాహో న్యూ లుక్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఇంస్టాగ్రామ్ ద్వారా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్‌లో ప్రభాస్ పోస్ట్ చేయనున్నారు.

    యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కీ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 కి ఇప్ప‌టికే ఇండియా మెత్తం క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌పంచంలో వున్న రెబెల్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు.

    Prabhas

     

    షేడ్స్ ఆఫ్ సాహో 2 తో ఈ చిత్రం హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన వీడియో కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ స్పెషల్ వీడియోలో శ్రద్దా కపూర్ క్యారెక్టర్ లుక్ ని రివీల్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్, శ్రద్దా కపూర్ స్టైలిష్ లుక్స్… ఇంటర్నేషనల్ స్టాండర్ఫ్స్ మేకింగ్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ మేకింగ్ వీడియోతో ఈ సినిమా ఏ రేంజ్‌లో తీస్తున్నారు అనేది మరింత స్పష్టమైంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… స్టార్ రైటర్ అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.

    - Advertisement -
    • TAGS
    • Instagram Account of Prabhas
    • Prabhas Instagram
    • Prabhas sahoo
    • Rebel Star Prabhas
    • Saaho making videos
    • Sahoo New Look
    • Tollywood news
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleమెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ప్రారంభం..
      Next articleకేన్స్‌లో మెరిసిన గోల్డ్ ఫిష్‌..ఐష్‌
      Mallesh
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv