కేన్స్‌లో మెరిసిన గోల్డ్ ఫిష్‌..ఐష్‌

355
aish gold fish
- Advertisement -

బాలీవుడ్ అందం ఐశ్వర్యారాయ్ బచ్చన్ రెడ్ కార్పెట్ పై మరోసారి మెరిసింది. ప్రతిష్టాత్మక కేన్స్‌ 72వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా రెడ్ కార్పెట్ పై ఆమె నడుస్తుంటే… కళ్లప్పగించి చూస్తుండిపోయారు అక్కడి జనం. కళ్లు చెదిరే రెడ్ కార్పెట్ పై మతిపొగొట్టింది. వయసు పెరిగిన తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది ఈ మాజీ ప్రపంచ సుందరి.

రెడ్ కార్పెట్‌పై వయ్యారాలు ఒలకబోస్తూ ఐశ్వర్యరాయ్ దర్శనమిచ్చారు. బంగారు వర్ణపు మెటాలిక్ గౌనులో ఎంట్రీ ఇచ్చిన ఆమె అందరి మతులు పోగొట్టారు.ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్ జీన్ లూయిస్ సబాజి డిజైన్ చేసిన గోల్డెన్ ఎల్లో కలర్ మెటాలిక్ గౌనులో ఐష్‌ దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతలా కనిపించారు.

ఆమె అందం ముందు డిస్నీ రాకుమారి కూడా చిన్నబోయింది అంటూ ఐష్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. ఐష్‌తో పాటు ఆమె కూతురు ఆరాధ్య కూడా కేన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐష్ డ్రెస్సుకు మ్యాచ్ అయ్యేలా ఆరాధ్య సైతం ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌను ధరించి పిక్చర్ పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ అభిమానుల్లో కలిగించారు. మొత్తంగా ఐష్‌,ఆరాధ్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

aaradhya aish aish aishwarya cannes aish cannes

- Advertisement -