ప్రభాస్‌తో మోదీ బయోపిక్‌ ఫస్ట్‌ లుక్‌..

508
prabhas
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తోన్న చిత్రం ఫస్ట్‌లుక్‌ విడులైంది. హిందీలో ‘మన్ బైరాగి’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘మనోవిరాగి’ పేరిట విడుదల చేస్తున్నారు.

Modi biopic

ఈ రోజున మోదీ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి హిందీ అలాగే తెలుగు ఫస్టులుక్ లను హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ప్రభాస్ తన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఈ ఫస్టులుక్ లను రిలీజ్ చేస్తూ, ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే ఈ సినిమా టీమ్ కి అభినందనలు అందజేశాడు.

ఈ చిత్రంలో ప్రధాని యువకుడిగా ఉన్న సమయంలో ఆయన జీవితంలో జరిగిన ముఖ్య మలుపు ఏంట‌నేది చూపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -