పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఈ మూవీతో వరుస ప్లాపులకు బ్రేక్ వేశాడు. కాగా, ప్రభాస్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. రాజకీయాల్లోకి ప్రభాస్ రానున్నాడని సమాచారం. ఆయన కృష్ణంరాజు లాగానే బీజేపీలో చేరనున్నాడని కొత్తగా రూమర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రభాస్ బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నాడని కూడా సమాచారం. ఐతే, ఈ వార్తలు పెద్దగా నమ్మసక్యంగా లేవు. రాజకీయాల పై ప్రభాస్ కి మొదటి నుంచి ఆసక్తి లేదు. అందుకే, ఈ వార్తలను ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకోవడం లేదు.
మరోవేపు, ప్రభాస్ ‘సలార్’ సక్సెస్ అయిన క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, ప్రభాస్ ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ”ప్రభాస్‌కు ఆరోగ్య సమస్యలున్నాయి. అందుకే, ప్రభాస్ సలార్ ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. 2027లో ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్‌కు ప్రాణగండం ఉంది. మరో హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది” అని వేణుస్వామి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయినా, ఫలానా హీరోకి ప్రాణ గండం ఉందని చెప్పడం వేణు స్వామికి ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది.
నిజానికి ప్రభాస్ అందరి లాంటి హీరో కాదు. అందరితో మర్యదగా ప్రవర్తిస్తాడు. ప్రభాస్ సినిమా షూటింగ్‌లో ఎంతమంది ఉంటే అంతమందికి వివిధ రకాల ఆహార పదార్థాలను తెప్పిస్తారు. ఇంట్లో కూడా ఎప్పుడూ ఒంటరిగా భోజనం చేయరు. 10 మంది చుట్టూ ఉంటారు. అసలు ప్రభాస్ రాత్రి పూట డిన్నర్ చేయాలంటే సుమారు రూ. 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు చేస్తారు. అంటే, అంతమందికి ప్రభాస్ భోజనం పెడతారు. అలాంటి ప్రభాస్ గురించి వేణు స్వామి పిచ్చి కామెంట్స్ చేయడం చాలా బాధాకరమైన విషయం.
Also Read:Samyuktha:సక్సెస్ ఫుల్ హీరోయిన్.. కానీ ఖాళీ!