సలార్.. ప్లాన్ ఛేంజ్ అయిందా?

40
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ డిసెంబర్ 22 విడుదలకు సిద్దమౌతోంది. కే‌జి‌ఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో ఈ మూవీ కోసం ప్రతి సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మూవీకి సరిగ్గా 50 రోజుల సమయమే ఉన్నప్పటికి ఇంతవరకు ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు. ప్రభాస్ బర్త్ డే కానుకగా ట్రైలర్ రిలీజ్ చేస్తారని భావిస్తే అది జరగలేదు. దీంతో సలార్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..

ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ సలార్ రీ షూట్ జరుపుకుంటుందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవాల్సిన సమయంలో రీ షూట్ జరుపుకోవడం ఏంటి అనే సందేహాలు రాక మానవు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం. సలార్ విషయంలో ప్లాన్ మొత్తం చేంజ్ చేశారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మొదట ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు చిత్రా యూనిట్ ప్రకటించింది.

అయితే స్టోరీ మొత్తం ఒకే భాగానికే సరిపోయేలా ఉండడంతో పార్ట్ 2 ను క్యాన్సిల్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నారట. ఒకే భాగంలోనే స్టోరీ మొత్తం గ్రీప్పింగ్ గా ఉండేలా తుది మెరుగులు దిద్దుతున్నారట డైరెక్టర్. అయితే ఈ వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని.. ఇదే గనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కొంత డిస్సపాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇక దీపావళి కానుకగా సలార్ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. మరి సలార్ విషయంలో చిత్ర యూనిట్ ఏం ప్లాన్ చేస్తుందో చూడాలి.

Also Read:మోడీ.. ప్రైవేట్ దోపిడీ!

- Advertisement -