ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ పలు ప్రజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇందులో ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీకై నెట్టింట వైరల్‌గా మారింది.
రీసెంట్‌గా కొత్త ఈ మూవీ షెడ్యూల్ ప్రారంభించారు. ఈ సెట్‌లో షూటింగ్ చేస్తున్నప్పటి ఓ పిక్ సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరో ప్రభాస్ ఫుల్ ఇమేజ్ కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వక్తం చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం కాస్త కంగారు పడుతోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 2023లో విడుదల కానుంది.