ప్రభాస్…సలార్ ఫస్ట్ లుక్

91
salaar

కరోనా లాక్ డౌన్ తర్వాత వరుస సినిమాలతో అలరించేందుకు సిద్దమవుతున్నాడు హీరో ప్రభాస్. ప్రస్తుతం రాధేశ్యామ్,ఆది పురుష్ చిత్రాలను చేస్తున్న ప్రభాస్…వీటితో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి స‌లార్ టైటిల్‌ని ఖరారు చేయగా తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ప్ర‌భాస్ స్లైలిష్ లుక్… చేతిలో తుపాకి ప‌ట్టుకుని ఉన్న ఫోటో సూపర్బ్‌గా ఉంది. హొంబ‌లే ఫిల్మ్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఇక ఆదిపురుష్ షూటింగ్ కూడా జ‌న‌వ‌రి నుంచే మొద‌లు కానున్న‌ట్టు వార్త‌లు రావ‌డంతో..ప్ర‌భాస్ ఏ ప్రాజెక్టును ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తాడో వేచిచూడాలి.