షారుఖ్ రికార్డులే ‘ సలార్ ‘ టార్గెట్?

28
- Advertisement -

బాక్సాఫీస్ వద్ద సలార్ బీభత్సం సృష్టిస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజే అని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఓ వైపు షారుక్ ఖాన్ డంకీ మూవీ పోటీలో ఉన్నప్పటికి ఇండియన్ సినీ అభిమానులంతా సలార్ జపం చేస్తున్నారు. బాహుబలి సిరీస్ తరువాత వరుస ఫ్లాప్స్ చూసిన ప్రభాస్ సలార్ మూవీలో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పవచ్చు. ఇక మొదటి రోజు సలార్ కలెక్షన్లను పరిశీలిస్తే.. ఎవరి ఊహకు అందని రీతిలో 178.7 కోట్ల గ్రాస్ రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సత్తా ఏంటో నిరూపించింది. ఇక రెండో రోజు కూడా ఇక రెండో రోజు కూడా రూ.117 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులను సెట్ చేసింది. దాంతో రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.295.7 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన మూవీగా సలార్ నిలిచింది..

ఇక క్రిస్టమస్ ఉండడం, ఆ తర్వాత వీకెండ్ న్యూ ఇయర్ ఉండడంతో సలార్ యుఫోరియా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది రెండు వరుస 1000 కోట్ల సినిమాలతో షారుక్ ఖాన్ సత్తా చాటాడు. ఇక డంకీ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలని భావించినప్పటికీ సలార్ దెబ్బకు డంకీ వసూళ్లు దారుణంగా పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సలార్ కు నార్త్ లో థియేటర్ల సంఖ్య పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినా బాలీవుడ్ హీరోలను మరోసారి కలవర పెడుతోంది. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే షారుక్ వెయ్యి కోట్ల రికార్డును ప్రభాస్ అలవోకగా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా సలార్ నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:తమన్నాకి ఇది చివరి అవకాశమే

- Advertisement -