ప్రభాస్ బర్త్‌డే సర్‌ప్రైజ్ అదుర్స్..

381
- Advertisement -

సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ “సాహో” చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న ప్రభాస్, ఇవాళ తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. “సాహో” మూవీతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు డార్లింగ్. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

డార్లింగ్ పుట్టినరోజు సందర్బంగా “సాహో” సినిమాకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్‌ను వీడియో ద్వారా విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తోంది. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో “సాహో” రూపొందుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇక ముందుగా చెప్పినట్లుగానే చాప్టర్ 1 పేరిట సాహో చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. పోలీసుల కార్లను ప్రత్యేకంగా తెరకెక్కించడం, కారు ఛేజింగ్ సన్నివేశాలు టీజర్ లో ఆసక్తి రేపుతున్నాయి. ఇందులో ప్రభాస్ స్టైల్, బైక్‌పై స్టంట్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అబుదాబిలో సుమారు నెల రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు దాదాపు 400 మంది పని చేశారు. అయితే.. ప్రస్తుతం “సాహో” చిత్ర టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్‌కు సంబంధించిన సినిమాల కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ చూసిన అభిమానులు ప్రభాస్‌కు బర్త్‌డే విషేష్ చెప్తూ టీజర్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -