వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం..

14
- Advertisement -

కేరళ వరద బాధితులకు అండగా నిలిచారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తనవంతు సాయంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం అందించాడు. ఏకంగా రూ.2 కోట్లు ప్రకటించాడు. దీంతో ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పటికే వరద బాధితులను ఆదుకునేందుకు నటులు మోహన్ లాల్, మమ్ముట్టి,సూర్య-జ్యోతిక,చిరంజీవి, అల్లు అర్జున్, రష్మికా తదితరులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి వ‌య‌నాడ్ బాధితుల కోసం కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ సాయాన్ని అందించారు.

Also Read:Gold Rate: గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు

- Advertisement -