Prabhas: ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?

33
- Advertisement -

‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ కు నార్త్ లో కూడా ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా సాహూ, ఆదిపురుష్, సలార్ చిత్రాలు ప్రభాస్ స్థాయిని మరింతగా పెంచాయి. ఇప్పుడు ప్రభాస్ తో బాలీవుడ్ స్టార్స్ కలిసి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరో ప్రక్క ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ క్రమంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ తో కూడా కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో ప్రభాస్ బాలీవుడ్ లో కూడా భారీ మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడని టాక్.

ఈ నేపథ్యంలో ఒక సినిమా నిమిత్తం ప్రభాస్ కు ఎంత పే చెయ్యబోతున్నారు అనేది అంతటా చర్చగా మారింది. బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు… ప్రభాస్ కు 120 కోట్లు దాకా ఒక్కో ప్రాజెక్టుకు వస్తోంది అట. అయితే ఒకేసారి మొత్తం పే చెయ్యరట. ప్రాఫిట్ షేరింగ్ పద్దతిలో ఈ ఎమౌంట్ ని ఇస్తారని వినికిడి. సలార్ 2కి కూడా ప్రభాస్ ఇంతే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభాస్ సరే అని అగ్రిమెంట్ కూడా చేసినట్లు తెలుస్తోంది.

దక్షిణాది నుంచి వచ్చిన ఓ పెద్ద హీరో ఈ మధ్యకాలంలో ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే మొదటి సారి. అలాగే ఈ అమౌంట్ కూడా రీజనబుల్ అని భావిస్తున్నారట. ప్రభాస్ కు సలార్ పార్ట్ 1తో వచ్చిన మార్కెట్ ఈ రకంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. 2024 మే 9న కల్కి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ను సాధిస్తోందో చూడాలి.

Also Read:మార్చి 8న ఉమెన్స్‌ డే ..ఎందుకో తెలుసా..?

- Advertisement -