“జాన్” సెట్ లోకి ప్రభాస్ రీ ఎంట్రీ

505
prabhas
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈమూవీపై ఎన్నో ఆశలుపెట్టుకున్న ప్రభాస్ అభిమానులకు నిరాశే ఎదురైంది. కలెక్షన్ల పరంగా పర్లేదు అనిపించుకున్నా సినిమా మాత్రం ప్లాప్ అనే చెప్పుకోవాలి.

ఇక ఈమూవీ తర్వాత ప్రభాస్ జిల్ మూవీ దర్శకుడు రాథాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈమూవీకి జాన్ అనే టైటిల్ ను కూడా ఖారారు చేశారు. ఇప్పటికే కొంత వరకు షూటింగ్ జరుపుకున్న ఈమూవీ..సాహో విడుదల కోసం కొద్ది రోజుల గ్యాప్ ఇచ్చారు.

అయితే తాజాగా ఉన్న సమాచారం మేరకు రేపటి నుంచి ప్రభాస్ తిరిగి జాన్ షూటింగ్ లో పాల్గోంటారని సమాచారం. సాహో తో అభిమానులను నిరాశ పరిచిన ప్రభాస్ జాన్ తో అయిన ఆకట్టుకుంటాడో లేదో చూడాలి మరి.

- Advertisement -