‘ఆర్ ఆర్ ఆర్’ కోసం రానా, ప్రభాస్..!

141
rrr
- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ”ఆర్.ఆర్.ఆర్”. అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ వంటి ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ తీసుకుని కల్పిత కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాదులో చివరి షెడ్యూలు షూటింగ్ జరుగుతోంది. ఇందుకోసం బాలీవుడ్ భామ అలియా భట్ కూడా ముంబై నుంచి వచ్చి షూటింగులో జాయిన్ అయింది. దీంతో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. ఇక చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి మరోపక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రమోషనల్ సాంగును కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బాణీలు కడుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ పాట చిత్రీకరణ కోసం ఆరున్నర కోట్ల వ్యయంతో భారీ సెట్స్ వేశారట. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ప్రభాస్, రానా కూడా ఈ పాటలో మెరవనున్నట్టు తెలుస్తోంది. చిత్రంలోని ప్రధాన తారాగణమైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్ తదితరులతో పాటు ప్రత్యేక గెస్టులుగా ప్రభాస్, రానాలు ఈ పాటలో కనిపిస్తారని తాజా సమాచారం. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సినిమాలో వీరిద్దరూ నటించిన సంగతి విదితమే. అందుకే, వారిద్దరినీ ఈ ప్రమోషనల్ సాంగులో ఇంక్లూడ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి ఈ పాట రాజమౌళి లెవెల్లో .. లావిష్ గా రానుందన్న మాట!

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ – శ్రీయా – సముద్రఖని – అలిసన్ డూడీ – రే స్టీవెన్ సన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -