ప్రభాస్ ఉండగా ఆమె కొడితే ఎలా ?

29
- Advertisement -

మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తోన్న చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఓ ఫైట్ సీన్ లీక్ అయ్యింది. ఈ సీన్ లో హీరోయిన్ మాళవిక మోహనన్ విలన్లను ఉతికి ఆరేస్తోంది. అసలు అదేంటి బ్రో ? అంటూ నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ప్రభాస్ సినిమాలో ఓ హీరోయిన్ భారీ ఫైట్ చేయడం ఏమిటి ?, అసలు మారుతి ఏం చేస్తున్నాడు ? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తానికి మాళవిక మోహనన్ విలన్లను కొట్టడం ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ప్రభాస్ ఉండగా ఆమె కొడితే ఎలా అనేది వారి అభిప్రాయం. కామెడీ, హారర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే, మాళవిక మోహనన్‌ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని అర్ధం అవుతుంది. తాజాగా మాళవిక మోహనన్‌ కి సంబంధించి లీక్ అయిన ఫైట్ సీన్ కూడా సినిమాలో కీలకం అని టాక్. ఇంతకీ ఈ సీన్ విషయానికి వస్తే.. మాళవిక మోహనన్‌ విలన్లను చితకబాదుతూ కనిపించింది. కూరగాయల మార్కెట్లో ఈ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. పక్కన ప్రభాస్ అయితే ఎక్కడా కనిపించలేదు. కాబట్టి.. మాళవిక మోహనన్‌ పై ఇది సోలో ఫైట్ అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాకి ‘రాయల్’, ‘అంబాసిడర్’ టైటిళ్లను పరిశీలిస్తున్నారు.

Also Read:ముందస్తు ఎలక్షన్స్.. జగన్ రెడీ !

ఇప్పటివరకు రాజా డీలక్స్ అనే పేరు వినిపించిన విషయం తెలిసిందే. త్వరలోనే పేరును ఖరారు చేస్తారని టాలీవుడ్ టాక్. ఇప్పటికే 55 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ హారర్ కామెడీ సినిమాకు కూడా భారీ గ్రాఫిక్స్ ఉంటాయి. దీనికితోడు మారుతి రాసుకున్న కథలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. అలాగే ప్రభాస్ ది డబుల్ రోల్. ప్రభాస్ కి డబుల్ రోల్ కొత్త కాదు, కానీ తాత మనవళ్ల కథలో నటించడం మాత్రం పూర్తిగా కొత్తే. పైగా ప్రభాస్ తండ్రి గెటప్ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటుందట.

- Advertisement -