ప్రభాస్ రాజా డీలక్స్ బిగ్ అప్‌డేట్

44
- Advertisement -

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. వారంరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, మాళవిక మోహనన్ మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఇది తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. ఐతే, కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ లాంటి నేషనల్ స్టార్ దర్శకుడు మారుతితో సినిమా చేయడం అంటే.. ప్రభాస్ తన ఇమేజ్ ను రిస్క్ లో పెట్టడమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఐతే, మారుతి మంచి దర్శకుడే. పైగా మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు. కానీ, మారుతి కి పరిధులు ఉన్నాయి. లోకల్ కంటెంట్ కు అలవాటు పడ్డ మారుతి.. ఉన్నట్టు ఉండి నేషనల్ వైడ్ గా అలరించాలంటే.. బాగా కసరత్తులు చేయాలి. అందుకే.. ప్రభాస్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా పూర్తిగా జోక్యం చేసుకుంటున్నాడు. అలాగే తన రాధేశ్యామ్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ను కూడా ఈ సినిమా స్క్రిప్ట్ లో కూర్చోపెట్టాడు.

ఇక ఈ సినిమాని 2024 సమ్మర్ లో విడుద‌ల చేయాల‌ని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రభాస్ కూడా అదే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. కానీ, సాధ్యం అవుతుందా ?, అవ్వాలి అంటే.. షూటింగ్ వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. మరి మారుతి ఈ సినిమాని ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. ఈ సినిమాకి ప్రస్తుతం రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -