‘త్రికోనాసనం’ వేస్తే ఏమౌతుందో తెలుసా?

79
- Advertisement -

యోగాలో ఏ వయసులో వారైనా వేయగలిగే ఆసనాలలో త్రికోనాసనం కూడా ఒకటి. ఈ ఆసనం త్రిభుజకారాన్ని పోలి ఉంటుంది. అందుకే దీనికి త్రికోనాసనం అనే పేరు వచ్చింది. ఈ ఆసనం ప్రతిరోజు వేయడం వల్ల శరీరకంగాను, మానసికంగాను ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలికండరాలకు త్రికోనాసనం ఎంతో మేలు చేకూరుస్తుంది. కాళ్ళు బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ త్రికోనాసనం తరచూ వేయడం వల్ల కాళ్ళు బలపడతాయి. చీలమండలల్లో శక్తి పుంజుకుంటుంది. ఇంక వెన్నెముక బలపడుతుంది. శరీర భాగాలన్నిటికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యల నుంచి ఈ త్రికోనాసనం ద్వారా విముక్తి పొందవచ్చు. అంతే కాకుండా ఈ ఆసనం ద్వారా ఉదర కండరాలన్నీ శక్తి పుంజుకుంటాయి. తద్వారా మలబద్దకం వంటి ఉదర సమస్యలు దూరం అవుతాయి. స్త్రీ పురుషులలో పునరుత్పత్తి అవయవాలను యాక్టివ్ చేస్తుంది. స్త్రీ లలో ఋతుక్రమ సమస్యలు దూరం అవుతాయి. పురుషులలో వీర్య కణాల వృద్దిని పెంచడంలో త్రికోనాసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది.

త్రికోనసనం వేయు విధానం

ముందుగా నిటారుగా నిలబడి రెండు పాదాలను వీలైనంత దూరంగా జరపాలి. ఆ తరువాత రెండు చేతులను భూమికి సమాంతరంగా జరపాలి.ఇప్పుడు ధీర్ఘంగా గాలి పీల్చుతూ, ఆ తరువాత నెమ్మదిగా గాలి వాదులుతూ కుడి చేతిని కుడి పాదానికి అంచాలి. ఎడమచేతిని తలమీదుగా నిలువుగా ఉంచి, తలను ఎడమచేతి వైపు తిప్పాలి. ఈ స్థితిలో మొదట 10-15 సేకన్లు ఉండి, ఆ తరువాత సమయం పెంచుతూ పోవాలి. ఆ తరువాత యథాస్థితికి వచ్చి.. ఎడమ వైపు కూడా ఇదే విధంగా చేయాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -