రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్‌..సంక్రాంతి బరిలో

125
radhe shyam
- Advertisement -

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కృష్ణంరాజు నిర్మిస్తుండగా ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది.

ఇటీవలే షూటింగు పార్టును పూర్తిచేసుకున్న ఈ సినిమాను ‘సంక్రాంతి’ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలీష్ గా .. డీసెంట్ గా కనిపిస్తుండగా విదేశీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

- Advertisement -