ఆనంది @ శ్రీదేవి సోడా సెంటర్

169
sridevi

పలాస్ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్‌. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్‌..సూరిగాడు అనే లైటింగ్ బాయ్ పాత్ర పోషించనుండగా వైవిధ్యమైన ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను జీ కొనుగోలు చేసింది. ఇందులో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్‌గా నటించగా మణి శర్మ సంగీతం అందించారు.

తాజాగా ఈ సినిమాలో కథానాయికగా ‘ఆనంది’ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆనంది’ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. అందువలన పల్లెటూరి అమ్మాయిగానే ఈ సినిమాలో ఆనంది కనిపించనుంది. టైటిల్ కి తగినట్టుగానే ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఆనంది లుక్ వదిలారు. ఈ ఫస్టులుక్ లో ఆమె చాలా అందంగా కనిపిస్తూ అలరిస్తోంది. ‘జాంబి రెడ్డి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆనంది, ఈ సినిమాతో మరో హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.