ప్రభాస్ మూవీ నుండి ఆకట్టుకునే పోస్టర్‌..

166
Radhe Shyam
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో కొనసాగే ఒక రొమాంటిక్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు. ఇటలీ నేపథ్యంలో ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పలు భాషల్లో జులై 30న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

ఈనేపథ్యంలో ఈరోజు శివరాత్రి పండుగ సందర్భంగా తాజాగా ఆసక్తికర పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రభాస్, పూజ జంట ప్రేమమైకంలో వున్నట్టుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘కొందరు దీనిని పిచ్చి అంటారు.. మేం మాత్రం ప్రేమ అంటాం.. ఈ ప్రేమకథ మీ హృదయాలలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది..’ అంటూ రాధే శ్యామ్ టీమ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

- Advertisement -