- Advertisement -
బాహుబలి, సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్….రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గోపికృష్ణా మూవీస్ బ్యానర్, యువీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా ప్రభాసన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రభాస్‌కు ఇది 20వ సినిమా కాగా దీనికి జాన్ లేదా ఓ డియర్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. తెలుగు తమిళ్, హిందీ , మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.
జులై 10 ఉదయం 10 గంటలకు ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రయూనిట్. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు ప్రభాస్.
- Advertisement -