శర్వానంద్ మా ఇంటి హీరో అని ప్రభాస్ అన్నారు. శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘మహానుభావుడు’. ఎస్కెఎన్ సహనిర్మాత. మెహరీన్ కథానాయిక. తమన్ స్వరకర్త. ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభాస్ హజరయ్యాడు. ఈ సంధర్బంగా గిఫ్టుగా డెట్టాల్, శానిటైజర్, ఇతర క్లీనింగ్ వస్తువులతో ఉన్న ఓ బాక్స్ ను శర్వాకు బహుమతిగా ఇచ్చాడు ప్రబాస్.
అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ…. `శర్వా మా ఇంటి హీరో. రన్ రాజా రన్ సినిమాను ఎవరితో చేయాలనుకున్నప్పుడు వంశీ వెంటనే శర్వానంద్ పేరు చెప్పాడు. తన యాట్యిట్యూడ్ బావుంటుందని కూడా చెప్పాడు. తనెప్పుడూ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ చేయలేదు కదా అని అంటే, ట్రై చేయండన్నా, నచ్చితే కంటిన్యూ చేద్దాం అన్నాడు. ఆ మాటలకు నేను, వంశీ, ప్రమోద్ సహా అందరం తనకు ఫ్యాన్స్ అయిపోయాం. ఆరోజు నుండి శర్వా నాకు బ్రదర్ అయిపోయాడు.’ అన్నారు.
అనంతరం శర్వానంద్ మాట్లాడుతూ… ‘ఈ సినిమాలో నేను ‘మహానుభావుడు’ అయితే రియల్ లైఫ్‌లో మహానుభావుడు ప్రభాస్ అన్న. ఈ విషయాన్ని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. మనల్ని ప్రేమించే వాళ్లు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్‌కు పాతిక మంది ఉన్నారు. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చన్నారు.
తనకు ప్రేమను ఇవ్వడమే తప్ప వేరేది తెలియదని. నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. నేను ‘రన్ రాజా రన్’ చేసినప్పుడు పిలిచి ‘హిట్ కొట్టాం రా ఎంజాయ్ చెయ్’ అన్నాడు. పక్క వ్యక్తి కూడా పైకి రావాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ప్రభాస్. మాకు చాలా సహకారం అందించినందుకు ధన్యవాదాలు. సినిమాను చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా రోజుల తర్వాత నేను మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఇది. మా చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకోచ్చాడు శర్వా.