కేరాఫ్ సూర్య … టీజర్

251
C/o Surya Teaser
- Advertisement -

సందీప్‌ కిషన్‌, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కేరాఫ్‌ సూర్య’. ‘నా పేరు శివ’ ఫేమ్‌ సుసీంథరన్‌ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను హీరో సూర్య విడుదల చేశారు. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తిచేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.   యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు.

టీజర్‌లో కమెడియన్‌ సత్య.. సందీప్‌ గురించిగొప్పగా చెప్పడం.. దానికి రివర్స్‌లో సందీప్‌ తింగర పనులు చేయడం ఫన్నీగా ఉంది. ‘రేయ్‌ మావా నేనింత అందంగా ఎలా పుట్టాను రా’ అని సందీప్‌ తనని తాను పొగుడుకుంటుంటే.. ఇందుకు సత్య ‘తూ.. నా బతుకు నేను చచ్చిపోతా’ అనడం నవ్వులు పూయిస్తోంది. ఓ మధ్యతరగతి యువకుడిగా హీరో కనిపించనున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

- Advertisement -