ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, స్టన్నింగ్ బ్యూటీ దీపికా పదుకొనె, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రఖ్యాత నిర్మాణసంస్థ వైజయంతీ మూవీస్ కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట కే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటివరకు అప్డేట్స్ ఇస్తు వచ్చిన మేకర్స్ తాజాగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే వార్తను అందించారు.
హైదరాబాద్‌లో ప్రారంభమై 10 రోజుల ప్రాజెక్టు కే షూటింగ్ జరగనుంది. ఈ నెలలో జరిగే షూటింగ్లో ప్రభాస్, దీపికా పదుకొణె లు పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ముఖ్యంగా ఈ కీలక షెడ్యూల్లో ప్రభాస్, దీపికా పదుకొణెలపై సీన్స్ చిత్రీకరిస్తారని సమాచారం. ఏప్రిల్ 2023లో విడుదల కానున్న ఈ హై-ఆన్ VFX చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, డాని శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
ప్రభాస్, అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొనె, దర్శకులు నాగ్ అశ్విన్ మరియు ఇండియన్ సినిమాలోని ప్రముఖ సినీ తారల కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ మూవీ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని తప్పక అందిస్తుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.