ప్రభాస్ నుంచి రెండు క్రేజీ అప్ డేట్స్

16
- Advertisement -

మహా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రభాస్ సినిమాల నుంచి క్రేజీ అప్ డేట్స్ వచ్చాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్‌-K’. తాజాగా చిత్ర యూనిట్ ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. మహాశివరాత్రి కానుకగా మూవీ నుండి ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ విడుదల తేదిని ప్రకటించింది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.

అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన మరో సినిమా స్పిరిట్. క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ ”ప్రభాస్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రభాస్ ‘స్పిరిట్’ పై క్రేజీ అప్డేట్ రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి…

భోళా శంకర్‌లో రీమేక్ సాంగ్‌…

ఓ తండ్రిగా గర్వపడుతున్నా..

మోక్షజ్ఞ ఎంట్రీకి ముందస్తు ప్లాన్ ?

- Advertisement -