యుఎస్‌లో ప్రభాస్ మేనియా

41
- Advertisement -

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సలార్. ఈమూవీ నుంచి టీజర్ విడుదలై ఆకట్టుకుంది.  విడుదలైన 52 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది.  సలార్‌తో పాటు ప్రభాస్ నుంచి రాబోతున్న మిగిలిన సినిమాల పై కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ముఖ్యంగా ప్రాజెక్ట్ కే అయితే నెక్స్ట్ లెవెల్ కి ఇండియన్ సినిమాని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఈ జూలై లో యూఎస్ లో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ కి అయితే చిత్ర యూనిట్ హాజరు కానుండగా ఆల్రెడీ యూనిట్ అక్కడికి చేరగా వారికి భారీ వెల్కమ్ ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందించారు.

Also Read:ఆ హీరోయిన్ విడాకులు.. నిజమే

భారీ మొత్తంలో కార్లతో  ర్యాలీ చేస్తూ చిత్ర యూనిట్ కి ప్రభాస్ కి సాదర స్వాగతాన్ని అందించారు.  ఈ వీడియో విజువల్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ప్రాజెక్టు Kలో దీపికా పదుకోనేతో పాటు దిశా పటాని,కమల్ హాసన్,బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -