ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్

409
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు శుభవార్త తెలిపాడు. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ జాన్‌. ఇప్పటివరకు ఈమూవీ షూటింగ్ లో పాల్గోనలేదు ప్రభాస్. తాజాగా ఈసినిమాకు సంబంధించి ప్రభాస్‌ ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చాడు. నా కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తున్న విషయం మీతో షేర్‌ చేసుకుంటున్నందుకు సంతోషిస్తున్నా. సరదా షూటింగ్‌ షెడ్యూల్‌ కోసం ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానంటూ ప్రభాస్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. పురాతమైన పెద్ద హాల్‌లో పియానో పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేసాడు.

ఈ ఫోటోను ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. 1970, 80 బ్యాక్ డ్రాప్‌లో యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ లవ్ స్టోరిని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కు ఇది 20వ సినిమా. జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌లో సంయుక్తంగా తెరకెక్కుతోంది. ప్రభాస్ చివరగా నటించిన సాహో మూవీ తెలుగులో పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయినా హిందీలో మాత్రం పర్వాలేదు అనిపించింది.

Prabhas

- Advertisement -