రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పన్మక్త గ్రామంలో పైగా భూముల వివాదంతో పాటు సినీనటుడు ప్రభాస్ భూమి క్రమబద్ధీకరణకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.కొనుగోలు చేసిన భూముల్లో ప్రభాస్‌ను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని చెబుతూనే ఆయనకు భూమి అప్పగించాలని మాత్రం ఆదేశాలివ్వలేమని తెలిపింది.
ఈ తీర్పు కాపీ అందిన ఎనిమిది వారాల్లో ప్రభాస్ దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. .పైగా భూముల వివాదాన్ని క్రమబద్ధీకరణతో పరిష్కరించవచ్చని సూచించింది న్యాయస్ధానం. ఆరు దశాబ్దాలకుపైగా వివాదంలో ఉన్న భూముల వ్యవహారంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని, వివాదాలు సమసిపోతాయని సూచించింది.
చట్టబద్దంగా భూమిని కొనుగోలు చేసినప్పటికీ వివాదాలు తలెత్తకూడదని భావించిన ప్రభాస్ దీని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారంది. దీనిని పరిష్కారించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది.
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పన్మక్త గ్రామం వద్ద తన గెస్ట్‌హౌస్‌కు రెవెన్యూ అధికారులు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.