‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు..

150
Maharshi

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డె కథానాయికగా నటించగా..అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటించారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈచిత్రాన్ని దిల్ రాజు, అశ్వినిదత్, పివిపిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈచిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు.

వచ్చే నెల 1వ తేదిన హైదరాబాద్ – నెక్లెస్ రోడ్ లోని ‘పీపుల్స్ ప్లాజా’లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. మహర్షి మహేశ్ బాబు కెరీర్ లో 25వ సినిమా కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈసినిమాలో మహేశ్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన సాంగ్స్,, ఫస్ట్ లుక్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈమూవీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు మహేశ్ అభిమానులు.