బహుబలి తర్వాత టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ ఆహర్నీశలు కష్టపడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం రైడర్స్ కాస్టూమ్స్ మేకింగ్ అసెంబ్లింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే దిశాపటానీ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ఇందులో బిగ్‌బీ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.
కాస్టూమ్ డిజైనర్ అర్చనా రావు, నితిన్ జిహాని అండ్ టీం మెంబర్స్ కలిసి రైడర్స్ ఉత్తమ లుక్‌లో కనిపించేలా డిజైనింగ్ వర్క్ కోసం చాలా కష్టపడ్డట్టు ఈ వీడియోతో తెలిసిపోతుంది. అంతేకాదు ఈ సినిమాలో ఆర్మీ ఎలాంటి ఆయుధాలు వాడారో కూడా ఈ వీడియో ద్వారా తెలిసిపోతుంది. మొత్తానికి తాజా వీడియోతో ప్రాజెక్ట్ K పై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు నాగ్ అశ్విన్.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే యేడాది జనవరి 12న విడుదల చేసేందుకు ప్రణాళికలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రభాస్ సలార్ సినిమా, మారుతీ దర్శకత్వంలో మరో హార్రర్ కామెడీ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా కానుంది.
ఇవి కూడా చదవండి…