ప్రభాస్ ‘కల్కి’ ఓ కొలిక్కి తెచ్చాడు

32
- Advertisement -

ప్రభాస్ ఫాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కారణం ‘నాగ్ అశ్విన్’ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ పై ఫైనల్ గా వారికో క్లారిటీ వచ్చింది. నిన్నమొన్నటి వరకు ప్రభాస్ వేరే సినిమాలతో బిజీ కారణంగా స్లో అయిన ఈ సినిమా.. ఈ నెల మూడో వారం నుంచి మరో మలుపు తీసుకోబోతుంది. ముఖ్యంగా ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ పై టీమ్ భారీగా కసరత్తులు చేస్తోంది. దీంతో ప్రభాస్ ఫాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు. ఈ నెల మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ చేసి.. ఈ ఏడాది సమ్మర్ లోపు టాకీ పార్ట్ పూర్తి చేసి.. ఈ లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి వెళ్లేముందు రిలీజ్ డేట్ లాక్ చెయ్యాలని నాగ్ అశ్విన్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

దీంతో, ప్రభాస్ ఫాన్స్ లో ఆనందం మొదలైంది. ‘కల్కి 2898 ఏడీ’ మొదలై రెండున్నరేళ్లు గడిచినా.. ఇప్పటివరకు ప్రభాస్ ఫాన్స్ లో అప్ డేట్స్ కోసం అసంతృప్తి, రిలీజ్ డేట్ ఇవ్వరు.. అందుకే నాగ్ అశ్విన్ పై, నిర్మాత అశ్వినీదత్ పై యుద్ధం మొదలు పెట్టారు ఫ్యాన్స్. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కాకపోతే, ఈ ఏడాది సమ్మర్ లోపు షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టి దసరా లేదా అంతకన్నా ముందే వినాయక చవితికి ‘కల్కి 2898 ఏడీ’ని విడుదల చేయాలని చూస్తున్నారు. అది ఎప్పుడనేది ఫిబ్రవరిలో రిలీజ్ డేట్ ఇస్తారని తెలుస్తుంది.

ఇది చూసాకే ప్రభాస్ ఫాన్స్ రిలాక్స్ అవుతున్నారు.. ఇప్పటికైనా ‘కల్కి’ని ఓ కొలిక్కి తెచ్చావా నాగ్ అశ్విన్ అంటూ సరదాగా కామెడీ చేస్తున్నారు. ఇక కల్కి సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, లజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో రానా వంటి స్టార్ నటులతో పాటు మరో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:గుమ్మడి కాయ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో!

- Advertisement -